Friday, 23 April 2021

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు అమిత్ మిస్త్రీ మృతి

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. నేటి ఉదయమే ఓ చేదు వార్త వినాల్సి వచ్చింది. మళ్లీ కాసేటికి మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. నేటి ఉదయం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మరణించారు. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు అమిత్ మిస్త్రీ(47) చనిపోయారు. గుండెపోటుతో కాసేపటి క్రితమే ఆయన మరణించారు. ఈ వార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 23) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హిందీలో క్యా కహ్నా, ఏక్ చాలీస్‌ కి లాస్ట్ లోకల్‌తోపాటు రాజ్, డీకే ద్వయం రూపొందించిన 99, షోర్ ఇన్ ది సిటీ, ఏ జెంటిల్మెన్ చిత్రాల ద్వారా మంచి గుర్తింపునుపొందారు. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ బండీష్ బండిట్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మరణంపై ఆయన మేనేజర్ మహర్షి దేశాయ్ ఓ ప్రకటన చేశారు. ఆయన ఉదయమే లేచి మామూలుగా రోజును ప్రారంభించారు. వ్యాయామం కూడా చేశారు. ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించారు. ఎలాంటి అనారోగ్యం లేదు, మందులు వాడిన దాఖలాలు లేవు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అని ఎమోషనల్ అయ్యారు. కరణ్వీర్ భోహ్రా, కరణ్ వీ గ్రోవర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుమీత్ వ్యాస్, కుభ్రా సైత్, రాజేష్ తైలాంగ్, సైరస్ సాహుకర్, ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే వంటి వారంతా సంతాపం ప్రకటిస్తూ పోస్ట్‌లు చేశారు. ఆయన మరణించారనే వార్త తెలియడంతో కుప్పకూలిపోయినట్టు అనిపించింది.. ఆయన మాకెంతో ప్రత్యేకం.. ఆయన కోసం స్పెషల్ క్యారెక్టర్స్ రాసే వాళ్లం. ఆయన్ను ఎంతో మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RZaPHp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...