Monday, 5 April 2021

'ఒరేయ్‌ బామ్మర్ది' అంటూ రంగంలోకి హీరో సిద్దార్థ్.. ఆ దర్శకుడితో కమిట్!!

ఆ మధ్య 'బొమ్మరిల్లు' లాంటి సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యంగ్ హీరో ఆ తర్వాత ''ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం'' లాంటి సినిమాలతో హిట్స్ పట్టేసి తెలుగు తెరకు గ్యాప్ ఇచ్చారు. తనదైన నటనతో యూత్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన ఈ గ్యాప్‌లో కొన్ని తమిళ సినిమాలు చేసి ఇప్పుడు '' అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగబోతున్నారు. ‘బిచ్చగాడు’ లాంటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన దర్శకుడు శశితో చేతులు కలిపిన సిద్దార్థ్ వైవిద్యభరితమైన కథను ఎంచుకొని మరోసారి తెలుగు తెరపై అలరించబోతున్నారు. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రానున్న ఈ మూవీ నుంచి సిద్దార్థ్ లుక్ విడుదల చేయగా విశేష స్పందన వస్తోంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్‌లు పోటాపోటీగా నటిస్తున్నారని చిత్రయూనిట్ అంటోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీకి సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అతి త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ws31xx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...