Thursday, 22 April 2021

చిట్టి ‘రౌడీ బేబీ’.. యాంకర్ రవి కూతురు క్యూట్ వీడియో వైరల్

కూతురి వియాకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. యాంకర్ రవి ఎప్పుడైనా లైవ్‌లోకి వస్తే అందరూ గురించే అడుగుతుంటారు. బుల్లితెరపై వియాతో కలిసి రవి అద్భుతమైన పర్ఫామెన్స్ చేశాడు. తండ్రీ కూతుళ్లు అనుబంధాన్ని తెలిసేలా చేసిన ఆ పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ తండ్రీకూతుళ్లు చేసే అల్లరి వైరల్ అవుతుంటుంది. గత ఏడాది లాక్డౌన్ సమయంలో వియాతో కలిసి రవి చేసిన వీడియోలు యూట్యూబ్‌లో బాగానే వైరల్ అయ్యాయి. యాంకర్ రవి తన యూట్యూబ్ చానెల్‌లో ఎక్కువగా తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలే షేర్ చేస్తున్నారు.తన భార్య, పాపతో కలిసి చేసే ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య వియా బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో రవి ఫ్యాన్స్ తెగ హల్చల్ చేశారు. ఇక అదే రోజు సాయంత్రం వియాతో కలిసి రవి లైవ్‌లోకి వచ్చేశారు. లైవ్‌లోనే తన కూతురితో కొన్ని ముచ్చట్లు చెప్పించాడు. తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడేసిన వియా అందరినీ కట్టిపడేసింది. యాంకర్ రవి ఈ మధ్య తన ఫ్యామిలీని ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. తన భార్య నిత్యతో కలిసి కవర్ సాంగ్స్ చేయడం, వెడ్డింగ్ యానివర్సరీ అని ఆ మధ్య రవి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. బుల్లితెరపైనా స్పెషల్ ఈవెంట్లు ఉంటే భార్య, తన పాపను తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు యాంకర్ రవికే కాకుండా తన ఫ్యామిలీకి కూడా మంచి క్రేజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా రవి భార్య నిత్య ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో వియా తన క్యూట్ స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రౌడీ బేబీ అంటూ వియా వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. వెనకాల సాయి పల్లవి రౌడీ బేబీ అంటూ దుమ్ములేపుతుండగా.. టీవీలో వస్తోన్న ఆ పాటకు వియా చిందులు వేసింది. ఆ వీడియోను తీసిన నిత్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా క్యూట్ లిటిల్ రౌడీ బేబీ అంటూ నిత్య తెగ మురిసిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sEoBvt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...