Tuesday, 6 April 2021

ఎక్కడికి వెళ్లేది లేదు.. ఇక్కడే ఉంటాను.. అందుకోసం ఎంతో కష్టపడ్డాను: సన్నీ లియోన్

ప్రతీ మనిషికి ఓ గతం ఉంటుంది. ఆ గతాన్ని మర్చిపోయి.. ఉన్నతస్థాయికి చేరుకోనేందుకు ప్రయత్నం చేస్తేనే జీవితంలో విజయం సాధించగలం. సరిగ్గా ఇదే పని చేసి.. తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బ్యూటీ . బిగ్‌బాస్ రియాల్టీ షోతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. ఆ తర్వాత జిస్మ్-2 సినిమాలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే గతంలో పోర్న్‌స్టార్ అయిన సన్నీపై అప్పట్లో చాలానే విమర్శలు వచ్చాయి. ఆమె ఇండస్ట్రీలో కొనసాగేందుకు అర్హురాలు కాదు అంటూ పలువురు డిమాండ్ చేశారు. అయితే అలాంటి వారందరికీ సన్నీ తన సినిమాలతోనే సమాధానం చెప్పింది. బాలీవుడ్‌లోనే కాక.. దక్షిణాది ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. తనకు దక్కిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. దీంతో పాటు ఎంటీవీ నిర్వహించే ‘స్ల్పిట్స్ విల్లా’ రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంటూ అభిమానులకు మరింత వినోదాన్ని పంచుతోంది. ఇటీవల సన్నీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను ప్రస్తుతం ఉన్న దశకు చేరుకొనేందుకు ఎంతో కష్టపడ్డానని.. భారత్‌కి రావడం తనకు ఎంతో కలిసి వచ్చిందని తెలిపింది. ‘ఇప్పటివరకూ నా సినీ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. అందుకోసం నేను ఎంతో కష్టపడ్డాను. నా కలలు సాకారం చేసుకొనేందుకు ఇదే సరైన ప్రదేశం. కాబట్టి నేను ఎక్కడికీ వెళ్లను.. ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నా. ఇక్కడే ఉండేందుకు నేను ఎంతో సమయం కేటాయించాను’ అని ఆమె తెలిపింది. సన్నీ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘హెలెన్’, ‘కోకాకోలా’ అనే సినిమాలలో నటిస్తోంది. వీటితో పాటు విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అనామికా’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఆమె నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wyAB4O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...