Friday, 23 April 2021

అదే నా కోరిక..! దయచేసి అలాంటివి పట్టించుకోవద్దు.. గోవా బ్యూటీ ఇలియానా ఓపెన్ కామెంట్స్

‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన .. ఆ తర్వాత టాలీవుడ్‌తో పాటు కోలివుడ్‌లోనూ బిజీ అయిపోయింది. పవన్‌కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజా వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ.. తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో ముంబై చెక్కేసింది ఈ గోవా బ్యూటీ. అక్కడ అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన బర్ఫీ సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఆ తర్వాత అక్కడ ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ బాటపట్టింది. రవితేజతో ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు ఆ సినిమా నిరాశే మిగిల్చింది. ఇటీవల అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘బిగ్ బుల్’ చిత్రంలో కనిపించింది ఇలియానా. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో రణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే గతంతో పోలిస్తే.. ఈ భామకు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. అయితే అందుకు కారణం లేకపోలేదట. సినిమాల ఎంపిక విషయంలో ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంటోందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘‘నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణం ఉంది. ఏది పడితే అది చేయాలని నేను అనుకోవడం లేదు. కథలో పాత్రకి ప్రాధాన్యం ఉండాలి. నా దగ్గరకు వచ్చిన కథలని ఆచితూచి ఎంపిక చేస్తున్నాను. రొటీన్‌కి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను. అంతేకాక.. పూర్తిస్థాయిలో యాక్షన్ చిత్రంలో నటించాలని ఉంది’’ అంటూ తన కోరికను వెల్లడించింది. ఇక ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారనే విషయాన్ని వెల్లడించింది ఇలియానా. ‘‘నా ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయలేకపోతున్నా.. అది హ్యాక్ అయింది. కాబట్టి అందులో ఎలాంటి ట్వీట్లు వచ్చినా పట్టించుకోవద్దు’’ అంటూ ఇలియానా తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aB0yHH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...