Saturday, 10 April 2021

BB3: ఉగాది రోజు బాలయ్య సర్‌ప్రైజ్.. బోయపాటి పక్కా స్కెచ్!! నందమూరి ఫ్యాన్స్ బీ రెడీ..

నందమూరి నటసింహం , మాస్ డైరెక్టర్ సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న సినిమా . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు కలగలుపుతూ ఈ సినిమా రూపొందిస్తున్నారు బోయపాటి. ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ఈ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జయంతి అయిన మే 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన బోయపాటి.. ఉగాది రోజు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు సినిమా టైటిల్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో టైటిల్ విషయమై చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట 'మోనార్క్' అనే టైటిల్ ప్రచారంలోకి రాగా, ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫైనల్ చేశారనే టాక్ వినిపించింది. అలాగే ‘టార్చ్ బేరర్’ అనే మరో టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తుండటంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఉడాది రోజున ఆ టైటిల్ వెల్లడించి నందమూరి అభిమానులను ఖుషీ చేయబోతున్నారట బోయపాటి. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించబోతున్నారట. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. థమన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన BB3 ఫస్ట్ రోర్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uy2qbM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...