Thursday, 29 April 2021

7 డేస్.. 6 నైట్స్.. పెళ్లి తర్వాత ప్రముఖ నిర్మాత కొడుకు పక్కా ప్లాన్! తండ్రితో కలిసి స్కెచ్

సినీ వారసులన్నాక సినిమాల్లో నటించడమే కాదు సినిమా రంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో భాగమవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా నేటితరం సినీ వారసులు ఇటు నటనా పరంగా అడుగులేస్తూనే వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత కుమారుడు, యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ కొత్త జర్నీ ప్రారంభించబోతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన ఆయన ఇక నిర్మాతగా మారబోతున్నాడు. 'తూనీగ తూనీగ' అనే సినిమాతో అప్పుడెప్పుడో హీరోగా పరిచయం అయిన .. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ప్రేమకథ చిత్రం 2, హ్యాపీ వెడ్డింగ్ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌లో హీరోగా నటించిన ఆయన ఇక తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుంటూ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. నిర్మాతగా మొదటి సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నాడట సుమంత్. ఈ సినిమాకి అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆయన తండ్రి ఎంఎస్‌ రాజు దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. గతేడాది 'డర్టీ హరి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు ఎంఎస్‌ రాజు. సో.. చూడాలి మరి ఈ తండ్రీకొడుకుల '7 డేస్.. 6 నైట్స్' స్కెచ్ ఏ మేర వర్కవుట్ అవుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u2pMq5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...