Sunday, 18 April 2021

పాయల్ ప్రియుడిని ఆమె ఫోన్‌ నెంబర్ అడిగిన నెటిజన్.. ఘోరంగా కౌంటర్ ఇచ్చిన ‘ఆర్‌ఎక్స్100’ బ్యూటీ

చేసిన పాత్ర ఎలాంటిదైనా తొలి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది పంజాబీ భామ . ‘ఆర్‌ఎక్స్100’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. ‘ఆర్‌డీఎక్స్100’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి సినిమాల్లో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరో వైపు కాంటెంట్ ఉన్న పాత్రల కోసం వెయిట్ చేస్తుంది పాయల్. అయితే లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది పాయల్. ఈ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో నటించి.. ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ భామ.. స్పెషల్ సాంగ్స్‌కి కూడా రెడీ అంటోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సీత’ సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్‌ని చక్కబెట్టుకుంటుంది పాయల్. కొద్ది రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్ పేరు సౌరబ్ డింగ్రా అనే విషయాన్ని రివీల్ చేసింది. అంతేకాక.. అతనితో దిగిన ఫోటోలు కూడా సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంది. పాయల్‌లానే సౌరబ్ కూడా సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన విషయాలను అతను తరచూ సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటాడు. తాజాగా సౌరబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాడు. ఈ సెషన్‌లో ఓ ఫాలోవర్ అతి చనువు తీసుకొని.. ‘పాయల్ రాజ్‌పుత్ మేడమ్ నెంబర్ ఇవ్వండి’ అంటూ పోస్ట్ చేశాడు. వెంటనే సౌరభ్ ఆ పోస్ట్‌లో పాయల్‌ని ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన పాయల్ ‘100’ అంటూ పోలీస్ కంట్రోల్ రూం నెంబర్‌ను అతనికి సమాధానంగా ఇచ్చింది. నెటిజన్‌కి ఆమె ఇచ్చిన కౌంటర్ చూసి ఆమె ఫాలోవర్లు తెగ నవ్వుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ROcUG9
v

No comments:

Post a Comment