Sunday, 7 March 2021

Virata Parvam: చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది.. ఉమెన్స్ డే స్పెష‌ల్ వీడియో

నేడు (మర్చి 8) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా 'విరాట ప‌ర్వం' మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్న సాయి పల్లవి, ప్రియమణి, ఈశ్వరి రావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ రోల్స్ చాలా గొప్పవి అని పేర్కొంటూరానా వాయిస్ ఓవ‌ర్‌తో వదిలిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ''చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీళ్లు ప్రతి రూపాలు. వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం'' అంటూ పాత్రల తీరుతన్నెలు చెప్పిన విధానం సినిమా యూనిట్ కాన్సెప్ట్ చెబుతోంది. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ 'విరాటపర్వం' చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 'రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనేది ట్యాగ్‌లైన్‌. దగ్గుబాటి , జంట‌గా నటిస్తుండగా.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి రోల్ ఈ సినిమాకు కీలకం కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా విడుద‌ల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన మూవీ అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30owlq2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...