Sunday, 7 March 2021

నా 18 ఏళ్ల వయసులో అలాంటి ఎక్స్‌పీరియన్స్.. నాన్నే దగ్గరుండి చేయించారు: సీక్రెట్స్ బయటపెట్టిన పూజా భట్

సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాలు కామన్. యాక్టింగ్‌లో భాగంగానే ఇలాంటి సీన్స్ చేస్తుంటారు హీరోహీరోయిన్లు. కాకపోతే కిస్ సీన్స్ చేసే విషయంలో కొందరు హీరోయిన్స్ వెనకడుగేయడం చూస్తుంటాం. అలాంటి ఓ సందర్భం గురించి వివరించింది బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, నిర్మాత మహేష్‌ భట్‌ కూతురు పూజా భట్‌. కెమెరా ముందు తన ఫస్ట్ కిస్ విషయంలో నాన్నే దగ్గరుండి ప్రోత్సహించారంటూ అప్పటి సీక్రెట్స్ అన్నీ వెల్లడించింది. చాలా కాలంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పూజా భట్‌.. 'బాంబే బేగమ్స్' అనే వెబ్‌ సిరీస్‌తో నటిగా రీ-ఎంట్రీ ఇస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా పూజా భట్‌ బాలీవుడ్‌ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభ సంగతులను గుర్తు చేసుకుంది. ఈ మేరకు తన ఫస్ట్‌ కిస్ ఎక్స్‌పీరియన్స్‌ గురించి తెలిపింది. 18 ఏళ్ల వయసులో మొదటిసారి కిస్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్న ఆమె, నాన్న ఇచ్చిన మోటివేషన్‌తో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశానని తెలపడం విశేషం. 'సడక్' మూవీలో భాగంగా ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు భయంతో వణికి పోయానని, ఆ సమయంలో నాన్న మహేష్ తనను పక్కకు తీసుకెళ్లి.. 'పూజా.. ముద్దుని నీవు వల్గర్‌గా ఫీల్ అయ్యావంటే.. అది వల్గర్‌గానే కనిపిస్తుంది. అదే నువ్వు ఆ ముద్దు సన్నివేశాన్ని ప్రేమిస్తూ.. ఇష్టంతో, గౌరవంగా భావించి చేస్తే అంతే గౌరవంగా ఆ సన్నివేశం పండుతుంది. కథలో భాగంగా ప్రతి సన్నివేశం ఇంటెన్షన్‌ ఏంటో తెలుసుకోవాలి' అని చెప్పారని పూజా భట్ చెప్పుకొచ్చింది. అలా తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సన్నివేశం అద్భుతంగా చేయగలిగానని, ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ కెమెరా ముందు నిబద్దతతో నటిస్తుంటానని పూజా తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sX6Lo1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...