Monday, 22 March 2021

S. Thaman: త్రివిక్రమ్, అల్లు అర్జున్ కారణంగానే అంతా..! పవన్ కళ్యాణ్‌తో సినిమా మిస్.. తమన్ కామెంట్స్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి సర్వం సిద్ధం చేస్తున్నారు. 'అజ్ఞాతవాసి'గా రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన పవన్.. ''గా సిల్వర్ స్క్రీన్‌పై తిరిగి సందడి చేయబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''కెరీర్ తొలినాళ్లలోనే ఓ సంగీత దర్శకుడికి మ్యూజికల్ సక్సెస్ అనేది చాలా రేర్‌గా వస్తుంది. 'అల.. వైకుంఠపురములో' మూవీలో అన్ని సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అందుకు ప్రధాన కారణమైన , అల్లు అర్జున్‌లకు కృతజ్ఞతలు. ఆ సినిమా తర్వాత 'సోలో బతుకే సో బెటర్, క్రాక్' సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన సాంగ్స్ చేశాను అప్పటినుండి కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. అయితే అప్పట్లో పవన్ చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నేను మిస్ అయ్యాను. కానీ, ఇప్పుడు 'వకీల్ సాబ్' సినిమాతో సెట్ అయింది. త్రివిక్రమ్ గారు నన్ను దిల్ రాజు గారికి పరిచయం చేయడంతో నేను వకీల్ సాబ్‌కు మ్యూజిక్ అందించే అవకాశం లభించింది. లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ లేట్ అయింది. లేట్ అయినా సరే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. డైరెక్టర్ శ్రీరామ్ వేణు కథ చెప్పగానే ‘మగువ మగువ’ ట్యూన్ చేశాను. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అవుతుంది. ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా దిల్ రాజు గారు, శ్రీరామ్ వేణు గారు ఈ సినిమాను డ్రైవ్ చేశారు. వకీల్ సాబ్‌లో సాంగ్స్ సందర్భానుసారంగా వస్తాయి'' అని అన్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lHnXvp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...