Monday, 22 March 2021

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆది సాయి కుమార్.. ఉగాదికి కొత్త మూవీ స్టార్ట్

'ప్రేమ కావాలి' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కసిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. జయాపజయాల సంగతి పక్కనబెట్టి డిఫరెంట్ స్టోరీలకు కమిటై సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే 'శశి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొంటూ షూటింగ్ తాలూకు వివరాలు ప్రకటించారు మేకర్స్. దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న కొత్త సినిమాలో హీరోగా ఆది సాయి కుమార్ నటించబోతున్నాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ కూడా భాస్కర్ బంటుపల్లి అందిస్తుండటం విశేషం. ఇందులో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్, స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారని మేకర్స్ అంటున్నారు. శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాకేత్ కొమండూరి సంగీతం, A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13వ తేదీన సినిమా ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలతో పాటు ఆది సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది వెల్లడిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. చూడాలి మరి ఈ సినిమాతో అయినా ఆది సాయి కుమార్ కెరీర్ టర్న్ అవుతుందా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f7H2FR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...