Tuesday, 9 March 2021

Prabhas: 'ఆదిపురుష్' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. లక్ష్మణుడు దొరికేశాడు! ఇదే ఫైనల్

బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ .. ప్రస్తుతం వరుసపెట్టి బిగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన ''సలార్, '' సినిమాలతో బిజీ అయ్యారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఏకకాలంలో జరుగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ సినిమా 'ఆదిపురుష్'కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విలన్ రోల్ అయిన రావణాసురిడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇక ప్రభాస్ సరసన సీతగా నటించబోతున్న హీరోయిన్ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే సీత‌గా కీర్తి సురేష్, కృతి సనన్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంలో రాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి ఈ రోల్ ఎవరిని వరిస్తుందనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మణుడిగా బాలీవుడ్ యాక్టర్ నటించబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఆయనతో చిత్రయూనిట్ సంప్రదింపులు ముగిశాయని, కాకపోతే సస్పెన్స్‌లో పెట్టారని టాక్ నడుస్తోంది. నిజానికి ముందుగా లక్ష్మణుడి పాత్ర కోసం శ్రీ విష్ణు, టైగ‌ర్ ష్రాఫ్ లను తీసుకున్నారని తెలియగా.. ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈయనే ఫైనల్ అని, అతిత్వరలో దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా రాబోతోందని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ 'ఆదిపురుష్' సినిమా ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమాను పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.‌


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3viBfDc
v

No comments:

Post a Comment