Friday, 19 March 2021

Nithiin: రంగ్ దే సెన్సార్ రిపోర్ట్.. రొమాన్స్ ఒక్కటే కాదు పుల్ కామెడీ కూడా!!

పెళ్లి తర్వాత యమ జోష్‌లో ఉన్న యంగ్ హీరో ఇటీవలే 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకుకొచ్చిన సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశాలను ఎంచుకొని వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ఆయన మరో వారం రోజుల్లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'రంగ్ దే' సినిమాతో వెండితెరపై అలరించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై రూపొందిన ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రంగ్ దే మూవీ చూసిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్‌గా స్పందించారట. చిత్రంలో రొమాంటిక్ సీన్స్‌తో పాటు కామెడీ సీన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయనే టాక్ బయటకొచ్చింది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గివ్ మీ స‌మ్ ల‌వ్‌' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ రంగ్ దే మూవీ నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన అన్ని సినిమా అప్‌డేట్స్ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి. నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 26వ తేదీన విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lsxZ3y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...