Friday, 19 March 2021

నేనింతలా ఎదిగానంటే కారణం నువ్వే.. ప్రతి పాఠం ఓ ఆశీర్వాదమే.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్

ఈ రోజు (మర్చి 19) . 1952 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు జన్మించిన ఆయన సినీ నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. 570 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాతగానూ రాణించారు. 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకొని నేటికీ సత్తా చాటుతున్న ఈ దిగ్గజ నటుడి పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి, సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రిని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు . ''మా నాన్నను ఎంతలా ఆరాధిస్తానో చెప్పేందుకు మాటలు చాలవు. నా జీవితంలో నాకు దొరికిన అదృష్టం నాన్న. నువ్వే నా బలం, నువ్వే నాకు స్పూర్తి. నువ్వే నా ప్రాణం. నా ఎదుగుదలలో అణువణువునా నీ ప్రోత్సాహమే.. ఈ రోజున ఇలా ఉండటానికి కారణం నువ్వే. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ ఉండదు. నువ్వు కురిపించే ప్రేమకు, చూపించే ఆప్యాయతకు థ్యాంక్స్ నాన్న. నువ్వు నేర్పించే ప్రతీ పాఠం కూడా ఓ ఆశీర్వాదమే. నేను జీవితంలో ప్రతీ క్షణం నీలా జీవించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కూతురు కూడా నీ అడుగుజాడల్లోనే పెరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వంటే మనస్పూర్తిగా ఇష్టం నాన్న'' అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో మంచు లక్ష్మి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ జానర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s4ziIf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...