Saturday, 20 March 2021

Mohan Babu: సమంతకు తోడుగా మోహన్ బాబు.. అక్కినేని కోడలికి కలెక్షన్ కింగ్ సపోర్ట్.. ఇదీ సంగతి!

గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ సినిమా 'శాకుంతలం'. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ మొదటిసారి శకుంతలగా పౌరాణిక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ భారీ సినిమాలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘీక పాత్రలు చేయడంతో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ హీరో మోహన్ బాబును కూడా భాగం చేయబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఆయనకు దుర్వాస మహర్షి పాత్ర దక్కిందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన తారాగణం వివరాలను సీక్రెట్‌గా ఉంచుతూ కేవలం శకుంతలగా సమంత, దుష్యంతునిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు గుణశేఖర్. ఈ క్రమంలో సమంత పౌరాణిక సినిమాలో కూడా భాగం కాబోతున్నారని, సామ్ పాత్ర విషయంలో అక్కినేని కోడలికి కలెక్షన్స్ కింగ్ సపోర్ట్ అందుతుందని తెలుస్తుండటం ఆసక్తికర అంశం. అత్యంత కోపిష్టి వాడైన దుర్వాసుని పాత్రకు మోహన్ బాబు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని యూనిట్ అంతా వ్యక్తం చేయడంతో ఆయననే ఫైనల్ చేశారట డైరెక్టర్. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యమిస్తూ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. అలాగే సమంత నిచ్చెలిగా నటించే ఛాన్స్ అచ్చ తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా నటించనుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ 'శాకుంతలం' రెగ్యులర్ షూటింగ్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tCYTsj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...