Saturday, 20 March 2021

దిల్ రాజు లాంచ్ చేసిన 'పీన‌ట్ డైమండ్' టీజర్.. అతని ఆలోచన చరిత్ర సృష్టించబోతోంది!!

చిన్న సినిమానే అయినా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ అయితే దానికి భారీ ఆదరణ దక్కుతోంది. హీరోహీరోయిన్ల సంగతి పక్కనబెట్టి అలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొత్త తరహా కథలతో కొత్త దర్శకనిర్మాతలు రాణిస్తుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా విడుదలైన 'పీన‌ట్ డైమండ్' టీజర్ చూస్తుంటే ఈ మూవీ కూడా అదే తరహాలో మంచి కంటెంట్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ కీలక పాత్రల్లో 'పీన‌ట్ డైమండ్' మూవీ రూపొందుతోంది. గతంలో ఏ సినిమాలో చూడని డిఫరెంట్ సబ్జెట్ ఎంచుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వెంక‌టేష్ త్రిప‌ర్ణ. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్న నిర్మాతలు.. తాజాగా ఈ మూవీ టీజర్‌ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని తెలుస్తోంది. అభిన‌వ్ స‌ర్ధార్ సిక్స్‌ప్యాక్ బాడీ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకేసారి రెండు టైం లైన్స్‌లో జరిగే కథగా ఈ సినిమాను డైరెక్టర్ వెంక‌టేష్ త్రిప‌ర్ణ ఎంతో ఆసక్తికరంగా మలిచారని అర్థమవుతోంది. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న ఈ 'పీన‌ట్ డైమండ్' మూవీకి , వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం ఇలా అన్ని బాధ్యతలను వెంక‌టేష్ త్రిప‌ర్ణ తీసుకోవడం విశేషం. చిత్రానికి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. జె. ప్ర‌భాక‌ర రెడ్డి సినిమాటోగ్ర‌ఫర్‌గా పని చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NCGLQ0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...