Wednesday, 24 March 2021

వైఎస్ షర్మిల చేతుల మీదుగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ పాట

ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బుధవారం ఈ సినిమాలో ‘అలలాగా మ‌న‌సే ఎగిసెనే...’ పాటను వై.ఎస్.షర్మిల విడుదల చేశారు. సినిమా పెద్ద విజయం సాధించాలని దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని, రమణ్ హీరోగా మంచి రేంజ్ చేరుకోవాలని ఎంటైర్ యూనిట్‌ను వై.ఎస్.షర్మిల అభినందించారు. మహిత్ నారాయణ్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో ఈ పాటను బాలాజీ రాశారు. యాజిన్ నజిర్ పాట పాడారు.ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘వై.ఎస్.షర్మిలగారు మా సినిమాలో అలలాగా మనసే ఎగిసెనే...’ అనే పాటను విడుదల చేయడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. షర్మిలగారికి మా ఎంటైర్ యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరోలనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. నటీనటులు: ర‌మ‌ణ్‌, వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత‌, వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం. ర‌మేష్‌, గోపి నిర్మాత‌: కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి బ్యాన‌ర్‌: సిరి మూవీస్‌ స‌మ‌ర్ప‌ణ‌: కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌ బ్యాగ్రౌండ్ స్కోర్‌: శ్రీ‌వ‌సంత్‌ సినిమాటోగ్ర‌ఫీ: ఎ.కె. ఆనంద్‌ ఎడిటింగ్‌: శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి ఆర్ట్‌: న‌రేష్ సిహెచ్‌. ఫైట్స్‌: అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు కొరియోగ్ర‌ఫీ: చ‌ందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sk8rIm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...