Wednesday, 24 March 2021

‘వకీల్ సాబ్’ ట్రైలర్.. పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు, ఫ్యాన్స్‌కి పండగే

పవర్ స్టార్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి.ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయబోతున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lMpvUT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...