Monday, 1 March 2021

'రొమాంటిక్' అప్‌డేట్ ఇచ్చిన ఛార్మి.. రమ్యకృష్ణను ట్యాగ్ చేస్తూ మ్యాటర్ చెప్పేసిన బ్యూటీ

తన కొడుకును ఎలాగైనా పాపులర్ హీరో చేయాలని డిసైడ్ అయిన పూరి జగన్నాథ్.. ఆకాష్ పూరీ కెరీర్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఆకాష్ తొలి సినిమా 'మెహబూబా' నిరాశ పర్చడంతో తన స్టైల్ మేకింగ్‌తో మూవీ చేస్తున్నారు. ఆకాష్ రెండో సినిమాగా ఈ 'రొమాంటిక్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరినే అందిస్తుండగా.. ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆకాష్ జంటగా హాట్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో రొమాంటిక్ సీన్స్ షూట్ చేసిన చిత్రయూనిట్ ఇటీవలే షూటింగ్ వర్క్స్ ఫినిష్ చేసింది. ఈ నేపథ్యంలో 2021 జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రొడ్యూసింగ్ పార్ట్‌నర్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రొమాంటిక్ పోస్టర్ వదులుతూ.. రొమాంటిక్ కిక్‌తో థియేటర్స్ లోకి రాబోతున్నాం. పవర్‌ఫుల్ పర్‌ఫార్‌మెన్స్ చూడటానికి రెడీగా ఉండండి అని ఛార్మి పేర్కొంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ కీలకం కానుందని సమాచారం. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ 'రొమాంటిక్' మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ బాగా దట్టించారని, కథాకథనాలతో పాటు రొమాంటిక్ సీక్వెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయని చిత్రయూనిట్ చెబుతున్న మాట. ఇప్పటికే విడుదలైన ఓ బీచ్ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సో.. చూడాలి మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ పూరి ట్రాక్ ఎక్కుతాడా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZY75Xp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...