Monday, 1 March 2021

సందీప్ కిషన్‌ను ‘అన్న’ అనేసిన లావణ్య త్రిపాఠి.. సారీ అంటూ దిద్దుబాటు

వేదికపై మాట్లాడేటప్పుడు ఒక్కోసారి పొరపాటు జరుగుతుంది. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడేస్తాం. ఒకరి గురించి పొరపాటును ఏదో మాట అనేస్తాం. ఇలాంటి పొరపాట్లు చాలా మంది సెలబ్రిటీలు చాలాసార్లు చేశారు. తాజాగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కూడా ఇలాంటి పొరపాటే చేశారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్‌ను ‘అన్న’ అనేశారు. వెంటనే ‘సారీ సారీ’ అంటూ తప్పును సరిచేసుకున్నారు. ‘నాకు కాదు అన్న.. మీకు అన్న’ అని కవర్ చేశారు. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందిన తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య తెలుగులోనే మాట్లాడారు. వచ్చీరానీ తెలుగును బాగానే మ్యానేజ్ చేశారు. ‘‘మేమందరం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మీరే (ప్రేక్షకులు). తెలుగు ఇండస్ట్రీని మళ్లీ ట్రాక్‌లోకి మీరందరూ తీసుకొచ్చారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ నా మనసుకు నచ్చిన సినిమా. డెన్నిస్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం నేను హాకీ నేర్చుకున్నాను. బైక్ నడపడం కూడా నేర్చుకున్నాను. కొవిడ్ టైమ్‌లో చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తిచేశాం. ఈ సినిమా మా అందరికీ చాలా ఎమోషనల్ మూమెంట్’’ అని లావణ్య వెల్లడించారు. ‘‘సందీప్ అన్న గురించి చెప్పాలంటే’’ అని సందీప్ కిషన్ వైపు చూసుకుంటూ అనిన లావణ్య త్రిపాఠి వెంటనే.. ‘‘నాట్ అన్న, సారీ సారీ’’ అని గట్టిగా నవ్వారు. అక్కడే ఉన్న హీరో రామ్ కూడా నవ్వుకున్నారు. ఆడియన్స్ అయితే ఒకటే అరుపులు. దీంతో లావణ్య కవర్ చేశారు. ‘‘మీ అన్న.. నా అన్న కాదు. నాకు ఫ్రెండ్’’ అని నవ్వుతూ వెల్లడించారు. ‘‘సందీప్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడు. నాకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ నాకు సహాయం చేస్తాడు. ఈ సినిమాలోని క్యారెక్టర్ విషయంలోనూ సందీప్ హెల్ప్ చేశారు. ఈ సినిమాలో నేను కాస్త రౌడీలా ఉంటాను. నేను మామూలుగానే మాస్ కానీ.. ఈ క్యారెక్టర్‌కు ఇంకొంచెం మాస్ కావాలి. అందుకే, కొంచెం రౌడీయిజం ఫ్లేవర్‌ను సందీప్ నాకు నేర్పించారు’’ అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r46C1O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...