Tuesday, 2 March 2021

ఖరీదైన కారుపై మోజుపడ్డ ఎన్టీఆర్.. దానికోసం ఎన్ని కోట్లు పెట్టారంటే..! నందమూరి హీరో లగ్జరీ చూడండి

కార్లంటే ఎవరికి మాత్రం మోజుండదు చెప్పండి. పైగా ఈ రోజుల్లో కారు అనేది ప్రెస్టేజీకి సింబల్‌గా కావడమే గాక ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమైన వస్తువుగా మారింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలయితే మార్కెట్‌లో వచ్చిన కొత్త కార్స్ వెంటనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ కన్ను ఓ ఖరీదైన కారుపై పడిందని, దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన ఆ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మార్చే అలవాటున్న ఎన్టీఆర్.. మార్కెట్ లోకి కొత్త బ్రాండెడ్ కారు వచ్చిందంటే చాలు దాని గురించి ఆరా దీస్తుంటారట. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా లగ్జురియాస్ కార్ అయిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) లంబోర్ఘిని కొనేశారట ఎన్టీఆర్. ఈ కారు ఖరీదు 5 కోట్లు అని సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే ఈ కారును ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారట ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ బుక్ చేసుకున్న కారుపై ఫిలిం నగర్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఈ యంగ్ టైగర్ ప్రస్తుతం మూవీలో కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 25 కోట్లకు పైగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఈ మూవీ పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నారు ఎన్టీఆర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bSlJEX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...