Tuesday, 2 March 2021

'A' రాపిడ్ ట్రైలర్: యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే..

నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'A'. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. సరసన ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటించింది. మార్చి 5న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదటి నుంచే డిఫరెంట్‌గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, ప్రోమోస్, ట్రైలర్ వరకూ అన్నింటితో సినిమాపై హైప్ పెంచేశారు. ఈ నేపథ్యంలో చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మరోసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా వదిలారు. ''యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగి రాలేనిదైనా నాకు సంతోషమే'' అంటూ హీరో చెప్పిన ఈ వీడియోలో హైలైట్ అవుతోంది. ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేసి ఈ వీడియో రూపంలో తమ సినిమాకు బెస్ట్ ప్రమోషన్ ఇచ్చారు. ఈ మూవీలో కథ అంతా ఓ చిన్నారి చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తుందని అర్థమవుతోంది. సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ (త్యాగం) అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచారని తెలుస్తోంది. హీరో నితిన్ ప్రసన్న మూడు విభిన్న పాత్రల్లో కనిపించనుండటం ఆసక్తికర అంశం. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని PVR పిక్చర్స్ వారు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uMurxd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...