Monday, 15 March 2021

టీవీ ప్రెజెంటర్‌ను పెళ్లాడిన జస్ప్రీత్ బుమ్రా.. ఎవరీ సంజనా గణేశన్?

ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. టీవీ ప్రెజెంటర్ సంజనా గణేశన్‌ను వివాహమాడారు. సిక్కు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుక సోమవారం జరిగింది. తమ పెళ్లి ఫొటోలను బుమ్రా, సంజన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రేమ, ఇది విలువైనదని మీరు గుర్తిస్తే.. అదే మీకు మార్గనిర్దేశం చేస్తుంది’’ అని మెసేజ్ కూడా ఇచ్చారు. ‘‘ప్రేమికులుగా ఉన్న మేము కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా జీవితాల్లో ఎంతో సంతోషకరమైన రోజుల్లో ఈరోజు ఒకటి. మా పెళ్లి వార్తను, మా సంతోషాన్ని మీతో పంచుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. జస్ప్రీత్ & సంజన’’ అని తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో వారు పేర్కొన్నారు. బుమ్రా ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. బుమ్రా నాలుగో టెస్టు నుంచి తప్పుకోవడం పట్ల బీసీసీఐ తన ప్రకటనలో ‘ఆయన వ్యక్తిగత కారణాల వల్ల’ అని మాత్రమే పేర్కొంది. ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, రెండు రోజులుగా బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తానికి సోమవారం నాడు సంజనను పెళ్లాడి బుమ్రా ఓ ఇంటివాడు అయ్యారు. ఇదిలా ఉంటే, అసలు బుమ్రా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? టీవీ ప్రెజెంటర్ అంటున్నారు.. ఏ టీవీలో ఆమె పనిచేస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడున్నాయి. సంజనా గణేశన్ స్వస్థలం పుణే. 1991 మే 6న ఆమె జన్మించారు. పుణేలోనే బీటెక్ వరకు చదివారు. 2014లో ఎంటీవీ స్ల్పిట్స్‌విల్లా షో ద్వారా సంజన గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోనీ, నిఖిల్ చిన్నప్ప హోస్ట్ చేసిన ఈ షో మధ్యలోనే గాయం కారణంగా సంజన తప్పుకున్నారు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా సంజన పనిచేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోగ్రఫీలో ‘‘టీవీ ప్రెజెంటర్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిజిటల్ హోస్ట్, దట్ మిస్ ఇండియా గర్ల్’’ అని పేర్కొన్నారు. స్టార్ స్పోర్ట్స్‌లో పలు స్పోర్ట్స్ షోలను సంజన హోస్ట్ చేశారు. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’‌లను కూడా ఆమె హోస్ట్ చేశారు. మోడలింగ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టిన సంజన.. ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫెమినా మిస్ ఇండియా పుణే పోటీల్లోనూ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ వంటి ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కూడా సంజన హోస్ట్ చేశారు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, దిల్ సే ఇండియా‌లకు గతంలో సంజన వ్యాఖ్యాతగా పనిచేశారు. వీటితో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తోనూ సంజన ఒప్పందం చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కమర్షియల్ షో ‘ద నైట్ క్లబ్’కు సంజన యాంకర్‌గా వ్యవహరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vklCet
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...