Monday, 15 March 2021

సగం కథ విని ఓకే చెప్పేశాను.. అందరూ కనెక్ట్ అవుతారు: లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ... ✪ ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్స్ టు బన్నీ వాసు గారు. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. ✪ గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనబెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. ✪ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసు గారికి, అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా నా సొంత వాయిస్‌తో డబ్బింగ్ చెవుతాను. ✪ కౌశిక్ ఎంత ఇంటెన్సన్‌తో కథ రాసాడో అంతే ఇంటెన్సన్‌తో కార్తికేయ ఈ సినిమాలో నటించారు. ఒక మంచి సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సరికొత్త స్క్రీన్ ప్లే అందరినీ అలరిస్తుంది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమా సైన్ చేశాను.. తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Ioxzo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...