Tuesday, 23 March 2021

షకీలా మరో సంచలనం.. పెళ్లి కాకుండానే ట్రాన్స్ జెండర్‌కి తల్లి.. టీనేజ్ డాటర్‌‌తో కలిసి షాకిచ్చింది

వెండితెరపై అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శృంగార తార బుల్లితెరపై కూడా అనేక సంచలనాలను క్రియేట్ చేస్తుంది. తన జీవితంలో వంచనకు గురై.. పది మందికి పైగా ప్రేమికుల చేతిలో మోసపోయిన షకీలా.. 43 ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి ఊసేలేకుండా ఒంటరిగానే జీవిస్తోంది. ప్రస్తుతం అవివాహితగానే మిగిలిపోయిన షకీలా సడెన్‌గా తన టీనేజ్ కూతుర్ని పరిచయం చేసింది. అందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అందమైన టీనేజ్ డాటర్ ట్రాన్స్ జెండర్ అంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది షకీలా. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు తన శృంగార రస చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన షకీలా ప్రస్తుతం సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు సంపాదించిన ఆమె.. బ్యాంక్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఇండస్ట్రీలో బతుకు సాగిస్తున్న షకీలా.. బుల్లితెరపై సందడి చేస్తున్నారు. గతంలో కన్నడ బిగ్ బాస్ 2లో పార్టిసిపేట్ చేసిన షకీలా.. తాజాగా తమిళ్‌లో ‘కూకూ విత్ కోమలి’ సీజన్ 2 కంటెస్టెంట్‌గా అలరిస్తూ ఫైనల్‌కి దూసుకొచ్చింది. ఈ సెలబ్రిటీ కుకింగ్ షోలో బాబా భాస్కర్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ సీజన్‌లో షకీలాకి ప్రేక్షకుల మద్దతు అంతకంతకూ పెరగడంతో ఆమె విన్నర్ కావడం ఖాయమే అంటున్నారంతా. అయితే ఈ షోలో భాగంగా టీనేజ్ కూతురు మిల్లాని పరిచయం చేసి షాకిచ్చింది షకీలా. అసలు పెళ్లి కాకుండా కూతురు ఏంటి అంటే.. ఆమె తన సొంత బిడ్డ కాదని చాలా ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నట్టు తెలిపింది షకీలా. అయితే మిల్లా.. ట్రాన్స్ జెండర్ అంటూ మరో బాంబ్ పేల్చింది షకీలా. ఆమె బాల్యంలోనే దత్తత తీసుకున్నట్టు తెలిపింది షకీలా. తన కూతురు మిల్లా.. మోడలింగ్ రంగంలో రాణించాలని చూస్తుందని.. ప్రస్తుతం కాస్టూమ్ డిజైనర్‌గా కెరియర్ సాగిస్తుందని ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది షకీలా. దీంతో మిల్లా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d0fr6T
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...