Sunday, 14 March 2021

కత్తెర పట్టిన జబర్దస్త్ జడ్జ్.. కూతరు అన్షుమాలిక చెప్పడంతో వెంటనే..! రోజా కొత్త బిజినెస్

అందచందాలు, చలాకీతనంతో ఓ తరం ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన .. నేటికీ అదే స్పీడు కొనసాగిస్తున్నారు. సినిమాల సంగతి పక్కనబెడితే జబర్దస్త్ జడ్జిగా, నగరి ఎమ్మెల్యేగా జనం గుండెల్లో అలాగే స్థిరపడ్డారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్‌తో బుల్లితెరపై హంగామా చేస్తూనే రాజకీయాల పరంగా చక్రం తిప్పుతున్నారు. నాటి నుంచి నేటి దాకా ఏ మాత్రం క్రేజ్ తగ్గని రోజా.. తన కూతురు కోరిక మేరకు ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడపడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకుంటారు రోజా. తన భర్త ఆర్కే సెల్వమణి, కూతురు అన్షుమాలిక, కొడుకు కృష్ణ లోహిత్ సెల్వమణిలతో సరదాగా గడుపుతూ వీలు చిక్కినప్పుడల్లా స్పెషల్ టూర్స్ వేస్తుంటారామె. అయితే ఇటీవలే కూతురి ఆలోచన మేరకు ఓ బ్యూటీ సెలూన్ బిజినెస్ ప్రారంభించారు రోజా. హైదరాబాద్ లోని సలీం కాటూన్ మసీద్ బిల్డింగ్‌లో యునిక్యూ అనే పేరుతో బ్యూటీ సెలూన్‌ను శుక్రవారం రోజు ఘనంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజా కత్తెర పట్టి కనిపిస్తుండటంతో పాటు టీనేజ్‌లో ఉన్న ఆమె కూతురుతో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రోజాకు, ఆమె కూతురు అన్షుమాలికకు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు ఇప్పటినుంచే పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా సొంతంగా తనకు తోచినంత సహాయం చేస్తోందట అన్షుమాలిక. ఇది తెలిసి తల్లి తగ్గ కూతురు, భవిష్యత్తులో రోజా పేరు నిలబెట్టే బాధ్యత అన్షుదే అని జనం చెప్పుకుంటుండటం గమనార్హం. ఇకపోతే గత రెండేళ్లుగా రోజా కూతురు అన్షుమాలిక సినీ ఎంట్రీ గురించి బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోజా మాత్రం ఇప్పుడే తన కూతురు సినీ రంగప్రవేశం గురించి ఆలోచించడం లేదని సమాచారం. ప్రస్తుతం అన్షుమాలిక విద్యాబ్యాసం కొనసాగుతోంది కాబట్టి ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30I6M3i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...