Thursday, 4 March 2021

బాయ్‌ఫ్రెండ్‌తో ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. ఆ పదం తన డిక్షనరీలోనే లేదన్న తండ్రి

‘సాహో’ బ్యూటీ శ్రద్ధ కపూర్.. రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉన్నట్టు ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి పలు ఫంక్షన్లలో జంటగా కనిపించడంతో వీరు ప్రేమించుకుంటున్నారని అంతా భావించారు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్లలో వీరిద్దరూ బాగా క్లోజ్‌గా కనిపించడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వదంతులు వ్యాపించాయి. అయితే ఈ పెళ్లి వదంతులపై రోహన్ తండ్రి రాకేష్ శ్రేష్ఠ స్పందించారు. ఈటైమ్స్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాట్లాడుతూ.. రోహన్, శ్రద్ధ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులని చెప్పారు. ‘‘కాలేజీ రోజుల నుంచే వాళ్లు స్నేహితులు అని నేను చాలా సార్లు చెప్పాను. మరోవైపు, వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారు. ఒకవేళ వాళ్లిద్దరూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంటే బాగా ఆలోచించి, పరిణతితో తీసుకున్న నిర్ణయమే అవుతుంది’’ అని రాకేష్ వెల్లడించారు. ‘‘ఒకవేళ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, వాళ్ల కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధం. ‘అభ్యంతరం’ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను రోహన్‌ను ‘మై డ్రీమ్’ అని పిలుస్తాను. చాలా అరుదుగా ‘రోహన్’ అని పిలుస్తుంటాను’’ అని రాకేష్ వివరణ ఇచ్చారు. రాకేష్ ప్రముఖ సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్. 600 వందలకు పైగా సినిమాలకు ఆయన పనిచేశారు. బాలీవుడ్‌లో తాను ఫొటోగ్రాఫర్‌గా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క సూపర్‌స్టార్‌ను తన కెమెరాలో బంధించారు. ఇదిలా ఉంటే, శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం స్పందించారు. రోహన్‌ను శ్రద్ధ పెళ్లి చేసుకుంటాను అంటే తాను ఎలాంటి అభ్యంతరం చెప్పనని ఆయన స్పష్టం చేశారు. శ్రద్ధ, రోహన్ ఇటీవల మాల్దీవులకు వెళ్లారు. శ్రద్ధ కజిన్ ప్రియాంక్ శర్మ, షాజా మొరాని పెళ్లి వేడుక మాల్దీవుల్లో జరిగింది. ఈ వేడుకలో శ్రద్ధ, రోహన్ పాల్గొన్నారు. వీళ్లిద్దరూ పెళ్లికి సంబంధించిన పలు ఫొటోల్లో జంటగా కనిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OjxTyD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...