Friday, 5 March 2021

రామ్ సరసన బేబమ్మ.. దూసుకుపోతున్న కృతిశెట్టి

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా మెప్పించిన మలయాళీ బ్యూటీ కృతిశెట్టి ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాని సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’లో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న కృతి.. సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌ను ఓకే చేశారు కృతిశెట్టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఆవారా’, ‘పందెంకోడి’ చిత్రాల ద‌ర్శకుడు ఎన్‌.లింగుస్వామి ద‌ర్శక‌త్వంలో ఒక ద్విభాషా చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఊర మాస్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్నట్లు అధికారికంగా ప్రక‌టించింది చిత్ర యూనిట్‌. రామ్ పోతినేని కెరీర్‌లో 19వ సినిమా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా లింగుస్వామి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వర‌లోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sYpSOR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...