Monday, 1 March 2021

నక్సలైట్‌గా రామ్ చరణ్.. నాన్నతో ప్రతి క్షణం.. కామ్రేడ్ మూమెంట్

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆచార్య’. సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పాత్ర పేరు ‘సిద్ధ’ అని ఇప్పటికే రివీల్ చేశారు. అయితే, ఆ పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. రామ్ చరణ్‌ భుజంపై వెనుక నుంచి చిరంజీవి చేయి వేసిన స్టిల్ అది. చిరంజీవి చేతికి ఎర్ర గుడ్డ కట్టి ఉండగా.. చరణ్‌కు కాస్త దూరంలో ఏకే 47 గన్‌ చెట్టుకు ఆన్చి ఉంది. చరణ్ డ్రెస్, ఆ గన్ బట్టి ఆయన నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది. అయితే, దీనిపై చరణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రామ్ చరణ్.. ‘‘కామ్రేడ్ మూమెంట్. ‘ఆచార్య’ సెట్స్‌లో నాన్న చిరంజీవి, కొరటాల శివ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కామ్రేడ్ అంటే ఇంకేముంది.. తాను నక్సలైట్ పాత్ర పోషిస్తున్నాని చరణ్ ఖరారు చేశారు. నిజానికి చరణ్ స్టూడెంట్ లీడర్ రోల్‌లో నటిస్తున్నారని గతంలో వదంతులు వచ్చాయి. కానీ, ఈ పోస్టర్‌తో ఆ రూమర్లన్నీ పటాపంచలైపోయాయి. అయితే, RRR సినిమా కోసం క్లీన్ సేవ్‌లో కనిపించిన రామ్ చరణ్.. ఈ ‘ఆచార్య’ పోస్టర్‌లో మాత్రం గెడ్డంతో కనిపిస్తున్నారు. అంటే, ఆయనకు కృత్రిమ గడ్డాన్ని తగిలించారా? అనే అనుమానం కలుగుతోంది. ఏదేమైనా రామ్ చరణ్ తొలిసారి తన తండ్రి సినిమాలో నిడివి ఎక్కువ ఉన్న పాత్ర పోషిస్తున్నారు. రేపు ఈ తండ్రీకొడుకులను వెండితెరపై చూడటానికి మెగా అభిమానులకు రెండు కళ్లు సరిపోవు అనడం అతిశయోక్తికాదు. అన్నట్టు ‘సిద్ధ’ ఫస్ట్ లుక్ సిద్ధమవుతోంది. ఈ విషయం చెప్పడానికే ఈ పోస్టర్‌ను చిత్ర యూనిట్ వదిలింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MyjyOe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...