Friday, 12 March 2021

Adipurush: సీత పాత్రపై కృతి సనన్ రియాక్షన్.. అతని అద్భుత సృష్టి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ సరసన భారీ సినిమా 'ఆదిపురుష్'లో నటించే ఛాన్స్ పట్టేసింది బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా సీతగా నటించబోతోంది. ఈ రోల్ కోసం మొదట చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన టీమ్ చివరకు కృతి సనన్‌ని ఫైనల్ చేసింది. ఇటీవలే 'ఆదిపురుష్' కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఆమెకు స్వాగతం పలికారు ప్రభాస్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఛాన్స్ దక్కడంపై చాలా క్రేజీగా రియాక్ట్ అయ్యింది కృతి. ''కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా. ‘ఆదిపురుష్‌’ లాంటి భారీ సినిమాలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. సీతగా నటించడం పెద్ద బాధ్యత. అయితే, ప్రతిభావంతులైన వ్యక్తులతో పని చేస్తున్నాను కాబట్టి హార్డ్‌ వర్క్‌ చేయడంతో పాటు నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మిగతాది దర్శకుడు ఓం రౌత్‌కి, అతని అద్భుత సృష్టికి వదిలేస్తా'' అని కృతి సనన్ పేర్కొంది. టీ సిరీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ భారీ చిత్రంలో రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్ర కాజోల్‌ని వరించిందని టాక్. ప్రస్తుతం 'ఆదిపురుష్' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bK0J4F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...