Tuesday, 9 March 2021

శ్రీవారి సేవలో A1 ఎక్స్‌ప్రెస్‌ టీమ్.. మొక్కులు చెల్లించుకున్న సందీప్‌ కిషన్‌, ‌లావణ్య త్రిపాఠి

సందీప్‌ కిషన్‌, హీరోహీరోయిన్లుగా ఇటీవలే విడుదలైన A1 ఎక్స్‌ప్రెస్ మూవీ పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా A1 ఎక్స్‌ప్రెస్‌ టీమ్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో , హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తమ తమ మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశిర్వాదం పొందారు. ఆ తర్వాత ఆలయ అధికారులు వీరికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. A1 ఎక్స్‌ప్రెస్‌ సినిమా విడుదలై మంచి విజయం సాధించిందని, ఇలా టీమ్ అందరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇకపోతే తనకు తిరుపతితో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పిన సందీప్ కిషన్.. తన చిత్రం A1 ఎక్స్‌ప్రెస్ స్వామి వారి కృపతో‌ సంపూర్ణ విజయం సాధించిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తుండడం సంతోషంగా ఉందని తెలిపారు. హాకీ గేమ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన A1 ఎక్స్‌ప్రెస్ సినిమాకు మొదటి రోజే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా వారంతం కల్లా ఆ మార్క్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ejD78A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...