Sunday, 7 March 2021

నాగార్జున‌ ‘వైల్డ్ డాగ్’ అప్‌డేట్.. మార్చి 12న శాంపిల్ వదులుతున్న కింగ్!

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందిన 6వ చిత్రం ఇది. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకొని రాసిన క‌థ‌తో అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ పాత్రలో నాగార్జున క‌నిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివ‌ర‌కూ సినిమాలోని ప్రధాన పాత్రధారుల‌ను ప‌రిచ‌యం చేస్తూ పోస్టర్లను మాత్రమే చిత్ర బృందం విడుద‌ల చేసింది. అవి ఆడియెన్స్‌లో సినిమాపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమా దేని గురించ‌నే విష‌యాన్ని వెల్లడించే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు నిర్మాత‌లు ప్రక‌టించారు. నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మార్చి 12 సాయంత్రం 4:05 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నట్లు ప్రక‌టించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టించిన ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర పోషించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాయగా, షానీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. తమన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. డేవిడ్ ఇస్మలోన్ యాక్షన్ డైరెక్టర్. శ్రావణ్ కటికనేని ఎడిటర్. ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ, అవిజిత్ దత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OwgmDm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...