Sunday, 28 February 2021

Golden Globe Awards 2021: విజేతల వివరాలు చూస్తే..

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2021 అవార్డుల వేడుకలు అమెరికాలో జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగా తారల సందడి కనిపించకపోవడంతో ఈ 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ కాస్త బోసిపోయిట్లుగా ఉంది. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని రెయిన్బో రూమ్, లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ నుంచి టీనా ఫే, అమీ పోహ్లెర్ నిర్వహిస్తున్నారు. టీవీ, సినిమా రంగాల్లోని ఉత్తమమైన కంటెంట్, నటన, ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తారు. మరి ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎవరెవరికి వరించాయో చూద్దామా.. ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ల్యాండ్ ఉత్తమ కామెడీ/ మ్యూజికల్ చిత్రం: బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీ ఫిలిం ఉత్తమ టెలివిజన్ సిరీస్ డ్రామా: ది క్రౌన్ ఉత్తమ నటుడు డ్రామా: చాడ్‌విక్ బోస్‌‌మెన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఉత్తమ నటి డ్రామా: ఆండ్రా డే ( ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే) ఉత్తమ నటుడు కామెడీ/ మ్యూజికల్ చిత్రం: సాచా బారోన్ కోహెన్ (బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీ ఫిలిం) ఉత్తమ సహాయ నటి: జోడి ఫాస్టర్ (ది మారిటానియన్) ఉత్తమ విదేశీ చిత్రం: మినారీ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3szb74I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...