పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ నెలకొంది. పూజా బామ్మ మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన పూజా.. ఆమెను తలచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ''ఈ క్యూటీని మేం కోల్పోయా. కష్టాల్లో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది. ధైర్యంగా ఉండడం, కావలసిన వారి కోసం ఈగోలను పక్కన పెట్టడం అన్నీ అలవాటు చేసింది. నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. లవ్ యూ ఆజీ. నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను'' అని పేర్కొంటూ బామ్మపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించింది పూజా. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అక్కిని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీలో నటిస్తోంది పూజా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sEj34S
v
No comments:
Post a Comment