Thursday, 4 February 2021

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన A ట్రైలర్.. సరికొత్త ప్రయోగంతో క్యూరియాసిటీ పెంచేసిన టీమ్

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'A'(AD INFINITUM)తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు దర్శకుడు యుగంధర్ ముని. ఈ సినిమాతో నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం కాబోతున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ''మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్'' ఫేమ్ ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ చేస్తూనే చిత్ర ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై ఆతృతను పెంచేయగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టింది. కొద్దిసేపటి క్రితం ఈ ట్రైలర్‌ని తమిళ స్టార్ రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఒక నిమిషం 44 సెకనుల నిడివితో కట్ చేసిన 'A' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సస్పెన్స్, థ్రిల్లింగ్, రొమాన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని తెలుపుతూ శాంపిల్ సన్నివేశాలను చూపించారు. సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ (త్యాగం) అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచామని ట్రైలర్ ద్వారా చెప్పారు మేకర్స్. ఒకే వ్యక్తి.. ఆ వ్యక్తిని కళల రూపంలో గతం వెంటాడటం, దీనికి మెడికల్ మాఫియా లింకు చేయడం చూస్తుంటే ఈ కథతో ఏదో సరికొత్త ప్రయోగం చేశారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కథ అంతా ఓ చిన్నారి చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తుందని అర్థమవుతోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారని చెప్పుకోవాలి. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో హీరో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. మార్చి 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pMRVPU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...