Thursday, 4 February 2021

పెళ్లి గోల భరించలేక ప్రభాస్ కీలక నిర్ణయం! బడా బిజినెస్‌మెన్ కూతురిని ఫైనల్ చేసిన రెబల్ స్టార్ ఫ్యామిలీ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే.. ప్రతిఒక్కరి నోట ముందుగా వినిపించే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే మనోడి వయసు నాలుగు పదుల్లో ఉంది మరి. ఇప్పుడు కాదు.. గత కొన్నేళ్లుగానే మ్యాటర్ చర్చల్లో నిలుస్తూ వస్తోంది. దీంతో టాలీవుడ్ లోకమంతా ఈయన పెళ్లి అప్‌డేట్ కోసం యమ ఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి, ఆయన చేసుకోబోయే అమ్మాయి అంటూ ఎన్నో వార్తలు షికారు చేశాయి. తాజాగా అలాంటిదే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ప్రభాస్‌ని అనుష్క పెళ్లి చేసుకోబోతుందని, వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని వార్తలు చక్కర్లు కొట్టగా వీటిని ఖండిస్తూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. మొదట మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి జరగనుందని అన్నారు.. అది నిజం కాకపోవడంతో ఆయన ప్రతిష్టాత్మక సినిమా 'బాహుబలి' సిరీస్ పూర్తిచేసుకోగానే పెళ్లి చేసుకుంటాడని చెప్పుకున్నారు కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభాస్ పెదనాన్న కూడా ప్రభాస్ పెళ్లి విషయమై సైలెంట్ అయినట్లు చెప్పేశారు. అయినప్పటికీ రెబల్ స్టార్ ఫ్యామిలీలో ప్రభాస్ పెళ్లిపై నిత్యం చర్చలు నడుస్తూనే ఉన్నాయట. దీంతో ఈ పెళ్లి గోల భరించలేక తాజాగా ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. కృష్ణం రాజు సతీమణి సన్నిహితులైన ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని రాజుగారి ఇంట్లోకి కోడలిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఆ అమ్మాయి బడా బిజినెస్‌మెన్ కూతురు అని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ పెళ్లికి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేశారని అంటున్నారు. ప్రభాస్‌కు పిల్లను ఇవ్వబోయే ఫ్యామిలీ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా అని తెలుస్తోంది. అమ్మాయి తండ్రికి అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు ఇతర బిజినెస్‌లు ఉన్నాయని సమాచారం. సో.. చూడాలి మరి దీనిపై ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pRN4x0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...