Monday, 8 February 2021

సన్నీ లియోనీపై చీటింగ్ కేసు: వాళ్లు చెప్పినవి అబద్ధాలు.. అసలు విషయం బయటపెట్టిన నటి

తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణలను ఖండించారు నటి సన్నీ లియోనీ. తప్పుడు సమాచారం కన్నా సగం వండిన వార్తలు ప్రమాదకరమని ఆమె అన్నారు. తాను కుదుర్చుకున్న డీల్ ప్రకారం ఏనాడూ సమయానికి డబ్బు అందుకోలేదని సన్నీ వాదిస్తున్నారు. తనను మోసం చేశారని ఒక ఈవెంట్స్ మేనేజర్ కొచ్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో సన్నీని గత వారం కేరళ పోలీసులు ప్రశ్నించారు. ఈ వార్త బయటకు రావడంతో హాట్ టాపిక్ అయ్యింది. కొచ్చిలో, నగర పరిసర ప్రాంతాల్లో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సన్నీ లియోనీ తన వద్ద రూ.29 లక్షలు తీసుకున్నారని.. కానీ, ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొనకుండా తనను మోసం చేశారని కేరళ డీజీపీకి అందజేసిన ఫిర్యాదులో ఆర్.శియాస్ అనే ఈవెంట్ మేనేజర్ పేర్కొన్నారు. 2019లో జరిగిన ఈవెంట్‌కు సంబంధించి ఆయన ఈ కేసు పెట్టారు. అయితే, ఈ విషయంలో తన తప్పులేదని.. తప్పందా ఈవెంట్స్ ఆర్గనైజర్‌దేనని అంటున్నారు సన్నీ లియోనీ. ఈవెంట్ ఆర్గనైజర్ అబద్ధాలు చెబుతున్నాడని.. అతడిపై చట్టమే చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఒక నటిగా పనే తనకు దైవం అన్న సన్నీ.. ఈ ఈవెంట్ ఆర్గనైజర్ కారణంగా తన షెడ్యూల్‌ను పలు సార్లు మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. తాను ఎంత సహకరించినా ఈవెంట్ మేనేజర్ మాత్రం ఒక తేదీకి కట్టుబడి ఉండలేదని ఆరోపించారు. ఒక నటి తేదీని లాక్ చేయడం, అడ్వాన్స్ ముందుగా చెల్లించడమనేది సాధారణంగా జరుగుతుందని.. కానీ, ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ విషయంలో ఇప్పటి వరకు అలా జరగలేదని అన్నారు. ఈవెంట్ తేదీ, సమయంను నిర్ణయించే అవకాశం తనకు కచ్చితంగా ఉండదన్నారు. అలాగే, తనకు రావాల్సిన డబ్బును కూడా సకాలంలో వారు చెల్లించలేదని సన్నీ లియోనీ ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో రాత్రింబవళ్లు షూటింగ్ చేస్తున్నామని, తమ జీవితాలను రిస్క్‌లో పెట్టి ఇండస్ట్రీ మళ్లీ తన కాళ్లపై తాను నిలబడేటట్టు చేస్తున్నామని సన్నీ అన్నారు. ఇలాంటి సమయంలో ఈవెంట్ కోఆర్డినేటర్స్ రూపంలో వచ్చిన అపవాదులు, అనైతిక ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయన్నారు. విచారణ అధికారులకు తాను ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చానని.. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని సన్నీ లియోనీ వెల్లడించారు. సన్నీ ప్రస్తుతం ‘స్ల్పిట్స్‌విల్లా’ కొత్త సీజన్ షూటింగ్‌లో భాగంగా తిరువనంతపురంలోనే ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a4E6Hn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...