Monday, 8 February 2021

పేరు మార్చుకున్న కాజల్ అగర్వాల్!

సాధారణంగా అమ్మాయి పుట్టినింటి నుంచి మెట్టునింటికి వెళ్లాక ఆమె ఇంటి పేరు మారిపోతుంది. అయితే, సెలబ్రిటీలు మొదట తమ తండ్రి ఇంటి పేరుతో పాపులర్ అవుతారు కాబట్టి దాన్ని అలానే ఉంచుకొని దానికి భర్త ఇంటిపేరును తగిలిస్తున్నారు. అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడిన తరవాత ఐశ్వర్య రాయ్.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ అయ్యారు. అలాగే, సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన తరవాత కరీనా కపూర్.. కరీనా కపూర్ ఖాన్ అయ్యారు. అదే విధంగా ఇప్పుడు అగర్వాల్.. కాజల్ అగర్వాల్ కిచ్లు అయ్యారు. గతేడాది అక్టోబర్‌లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు తన పేరును మార్చుకున్నారు. ‘అగర్వాల్’ను షార్ట్ ఫామ్‌లో ‘ఎ’గా మార్చి తన భర్త ఇంటిపేరు ‘కిచ్లు’ను చివర్లో జత చేశారు. దీంతో కాజల్ ఎ కిచ్లు అయ్యారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మార్చుకున్న పేరును పొందుపరిచారు కాజల్. అయితే, తన పేరును కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే మార్చారు కాజల్. ట్విట్టర్ ‘కాజల్ అగర్వాల్’గానే కొనసాగుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ట్విట్టర్‌లో కన్నా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నారు. కాజల్ కూడా అంతే. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 17.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అందుకే, ఆమె ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును మార్చినట్టున్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’లో ఒక పాత్ర పోషిస్తున్నారు. మరో మూడు తమిళ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టారు. మొత్తం మీద పెళ్లి తరవాత కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కాజల్ ఎ కిచ్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39XWn8Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...