Wednesday, 17 February 2021

రామ్ చరణ్ తప్ప నాకు ఎవ్వరూ కనిపించట్లేదు.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ

‘ఉప్పెన’ విజయోత్సవ సభ రాజమండ్రిలో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ‘ఉప్పెన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ పేరిట వి.ఎల్.పురంలోని మార్గాణి ఎస్టేట్స్ మైదానంలో జరిగిన ఈ సభలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, బుచ్చిబాబు సానా, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు ఇతర ‘ఉప్పెన’ యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అలాగే, ఎంపీ భరత్ కూడా విచ్చేశారు. ఈ వేడుకలో హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ రామ్ చరణ్‌పై తన మనసులో మాటలను బయటపెట్టారు. ‘‘కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే, చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నిజానికి నాకు రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని. ‘రంగస్థలం’లో ఏం చేశారు సార్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ సార్’’ అని చరణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు కృతిశెట్టి. ఇక సుకుమార్ గురించి మాట్లాడుతూ.. ‘‘మీరు ఉప్పెనలో ఒక లైట్ హౌస్‌ను చూసుంటారు. ఈ సినిమాకు సుకుమార్ గారు ఒక లైట్ హౌస్‌లా ఉన్నారు. మాకు దారి చూపించారు’’ అని అన్నారు. బేబమ్మ లాంటి పాత్రను, ‘ఉప్పెన’ లాంటి కథను తనకు ఇచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబుకు చాలా చాలా థాంక్స్ అని కృతిశెట్టి అన్నారు. ‘‘సినిమా చూసి చాలా మంది ఫోన్ చేసి ఈ స్టోరీ ఎప్పుడూ మా గుండెల్లో ఉండిపోతుందని చెపుతున్నారు. చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బుచ్చిగారు. సినిమాటోగ్రాఫర్ శామ్ గారు నన్ను చాలా అందంగా చూపించారు’’ అని బేబమ్మ వెల్లడించారు. హీరో వైష్ణవ్ తేజ్ ట్రూ జెంటిల్‌మేన్ అని అన్నారు కృతి. విజయ్ సేతుపతి నుంచి తను చాలా నేర్చుకున్నానని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మెలొడీస్ ఎప్పుడూ తమతోనే ఉండిపోతాయని అన్నారు. మైత్రీ లేకపోతే ఉప్పెన లేదని.. నిర్మాతలు నవీన్, రవి తనను సొంత కూతురిలా చూసుకున్నారని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NF9Wle
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...