Wednesday, 17 February 2021

రాజమండ్రిలో ‘ఉప్పెన’: జనసంద్రమైన వేదిక.. వారిని పదే పదే హెచ్చరించిన యాంకర్ శ్యామల

పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఉప్పెన’ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రాజమండ్రిలో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా సొంత జిల్లా తూర్పుగోదావరి కావడంతో రాజమండ్రిలో విజయోత్సవ సభను తలపెట్టారు. చాలా కాలం తరవాత రాజమండ్రిలో ఒక సినిమా ఈవెంట్ జరగడం, అందులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రావడంతో మెగా అభిమానులు ఎగబడ్డారు. రాజమండ్రిలోని వి.ఎల్.పురంలో ఉన్న మార్గాణి ఎస్టేట్స్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ విజయోత్సవ సభ జనసంద్రమైపోయింది. విశాలమైన మైదానంలో భారీ సెట్ వేసి నిర్వహించినా జనాన్ని కంట్రోల్ చేయడం నిర్వాహకుల వల్ల కాలేదు. శ్రేయాష్ మీడియా కరోనా పరిస్థితుల తరవాత హైదరాబాద్ బయట భారీ ఎత్తున నిర్వహించిన ఈవెంట్ ఇది. ఇలాంటి ఈవెంట్‌కు మెగా అభిమానులు కాస్త ఇబ్బంది కలిగించారు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేసిన స్తంభాలు ఎక్కడం, మైక్ వైర్లు లాగేయడం వంటివి చేశారు. దీంతో యాంకర్ శ్యామల పదే పదే మెగా అభిమానులను సున్నితంగా హెచ్చరించారు. దయచేసి అభిమానులు కాస్త ఓపిగ్గా ఉండి ఈవెంట్ జరగనివ్వాలని కోరారు. ఆఖరికి శ్రేయాష్ మీడియా అధినేత శ్రీనివాస్ సైతం వేదికపైకి వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఒక గంటలో ఈవెంట్ అయిపోతుందని.. దయచేసి తమకు సహకరించాలని కోరారు. పోలీసులు సహకరించి అభిమానులను కంట్రోల్ చేయాలని వేడుకున్నారు. ఆఖరికి పోలీసులు అభిమానులపై లాఠీ ఝళిపించారు. మొత్తం మీద చిన్న చిన్న ఇబ్బందులతో ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కొనసాగింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఎంపీ భరత్, తదితరులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jXzJRu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...