Thursday, 11 February 2021

కొణిదెల హీరో సినిమా.. పాట విడుదల చేస్తున్న వైఎస్ షర్మిల

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను ఇప్పటి వరకు రాజకీయ వేదికపైనే మనం చూశాం. ఇప్పుడు ఆమెను వినోద రంగంలో చూడబోతున్నాం.. ఒక అతిథిగా! ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే సినిమాలోని పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. ‘ఏమిటో ఏమిటో’ అంటూ సాగే ఈ పాటను రేపు (ఫిబ్రవరి 12న) సాయంత్రం 4:05 గంటలకు వైఎస్ షర్మిల విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా నుంచి విడుదలవుతోన్న రెండో పాట ఇది. కార్తీక్ కొడగండ్ల స్వరపరిచిన ఈ పాటను దీపు జాను, నూతన మోహన్ ఆలపించారు. శ్రేష్ఠ సాహిత్యం అందించారు. ఈ సినిమా ద్వారా కొణిదెల ఫ్యామిలీకి చెందిన పవన్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ పవన్ తేజ్ దగ్గర బంధువు. ఇప్పుడు ఈ సినిమాలోని పాటను వైఎస్ షర్మిల విడుదల చేయబోతున్నారని ప్రకటించడంతో చాలా మంది కళ్లు ఈ సినిమాపై పడ్డాయి. షర్మిల ఇమేజ్ ఈ సినిమా ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంటీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. అభిరామ్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌లో మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. సునీల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు. తాజుద్దీన్ సయ్యద్ మాటలు రాశారు. కార్తీక్ కొడకొండ్ల సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MZ5w8H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...