సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.కీరవాణి చిన్న కుమారుడు, ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటించిన రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లు. మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఓ కారులో హీరో శ్రీసింహా మరో అమ్మాయిని ఒళ్లో కూర్చోపెట్టుని రొమాన్స్ చేస్తుంటే, వారిని ఓరకంట చూస్తూ అతని భార్య కారును డ్రైవ్ చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ పెళ్లి దుస్తుల్లోనే ఉండటం గమనార్హం. కారులోని మిర్రర్‌కు డాక్టర్లు ఉపయోగించే స్టెతస్కోప్ ఉండటం ఇంకో విశేషం. ఈ పోస్టర్ చూస్తుంటే శ్రీసింహా మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. ‘కలర్ ఫొటో’తో లాక్‌డౌన్‌లో సూపర్ హిట్ అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి మరో హిట్ మూవీని అందిస్తోందని అంటున్నారు. ఈ సినిమాని శ్రీసింహా అన్నయ్య కాలభైరవ సంగీతం సమకూరుస్తు్న్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించారు. రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి ముఖ్యపాత్రలు పోషించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aXR9cC
v
No comments:
Post a Comment