Thursday, 11 February 2021

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మైత్రి నిర్మాతలు.. బాలయ్య తదుపరి సినిమాపై కీలక అప్‌డేట్

సీనియర్ హీరో మంచి ఫామ్‌లో ఉన్నారు. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేస్తున్న బాలయ్య బాబు తదుపరి సినిమా 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉండబోతోంది. ఆ విషయమై గత కొద్దిరోజులుగా షికారు చేస్తున్న వార్తలు నిజమేనంటూ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మైత్రి నిర్మాతలు. బాలకృష్ణ- కాంబోలో సినిమా అతిత్వరలో ప్రారంభం కానుందని మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ పేర్కొన్నారు. తాజాగా రీసెంట్‌గా ‘ఉప్పెన’ ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని ఓ కథ సిద్ధం చేస్తున్నారని, బాలయ్య చేస్తున్న BB3 షూటింగ్ ఫినిష్ కాగానే తమ బ్యానర్‌పై ఈ సినిమా సెట్స్ మీదకొస్తుందని తెలిపారు. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యేలా ఉంటుందని, దీని కోసం తాము కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఆ వెంటనే మే నెలలో రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారని టాక్. ఇటీవలే రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాతో మాస్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన గోపీచంద్ మలినేని ఈ సారి మరింత పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన ఈ భారీ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా షురూ చేశారనేది ఫిలిం నగర్ టాక్. సో.. బోయపాటి, గోపీచంద్ ఇద్దరూ మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్లు కాబట్టి ఇక వరుస ప్రాజెక్టులతో బాలయ్య అభిమానులు ఈలలతో గోల పెట్టే రోజులే ముందున్నాయని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3peCfDP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...