బుల్లితెర, వెండితెర అనే తేడానే లేకుండా మంచి జోష్‌లో యాంకర్ అనసూయ. మూడు పదుల వయసులోనూ గ్లామర్ డోస్‌తో ఆకట్టుకుంటూ టాలెంట్ బయటపెడుతోంది. బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా వచ్చిన పాపులారిటీతో వెండితెరపై వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఫోటోతో ఏకంగా పోస్టర్ స్టాంప్ ముద్రించడంతో ఉబ్బితబ్బిబ్బయింది అనసూయ. ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’ ఆమెను తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడిస్తూ ఈ పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేశారు. ఈ స్టాంప్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన అనసూయ.. తనను ఇలా సత్కరించడంపై చిత్రపురి చలన చిత్రోత్సవం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. లైఫ్‌లో ఇంతకు మించిన గౌరవం ఏది ఉండదంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనసూయ. ''నా సొంత పోస్టల్ స్టాంపులు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ అర్హత పొందేందుకు నేనేం చేశానో తెలీదు కానీ దీనిపట్ల నేను గర్వపడుతున్నాను. నన్ను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది అని భావిస్తున్నాను. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నా వంతుగా సహాయం చేస్తా'' అని పేర్కొంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వంతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కొంత మొత్తం చెల్లిస్తే.. వారి ఫోటో పేరుతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను రెడీ చేస్తున్నారు. ఇదే కోవలో అనసూయ పోస్టల్ స్టాంప్‌ను చిత్రపురి చలన చిత్రోత్సవం వాళ్లు విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంప్ రిలీజ్ కావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jF5PRN
v
No comments:
Post a Comment