Thursday, 11 February 2021

ఆర్కే నాయుడు ‘షాదీ ముబారక్‌’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ దిల్ రాజు స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించడంతో పాటు కొత్త వాళ్లతో చిన్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఆయన ప్రోత్సహిస్తున్నారు. కథ నచ్చితే అది పెద్ద సినిమానా చిన్న సినిమానా అని దిల్ రాజు ఆలోచించరు.. ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తాజాగా మరో చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్‌’‌. ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు వీర్‌ సాగర్‌ ఈ సినిమాలో హీరో. దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 5న విడుద‌ల చేస్తున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురువారం విడుదల తేదీని ప్రకటించింది. ఇటీవల విడుద‌లైన ఫ‌స్ట్‌ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఈ సినిమా రూపొందిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే ‘షాదీ ముబారక్‌’ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తామ‌ని తెలియ‌జేసింది. ఈ చిత్రంలో ఇంకా ఝాన్సీ, హేమ, రాజశ్రీ నాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫి అందించారు. మధు ఎడిటర్. కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం పద్మశ్రీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3daMh6y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...