Thursday, 11 February 2021

ఛాన్స్ అడిగితే రూమ్‌కి రమ్మన్నారు.. బస్టాండులో ఏడ్చా! జబర్దస్త్ వాళ్లే అంటూ నిజాలు బయటపెట్టిన హరిత

షో.. గత ఎనిమిదేళ్లుగా బుల్లితెరపై కితకితలు పెడుతూ ఎంతోమంది కెరీర్‌కి పునాది వేసిన షో ఇది. టాలెంట్ ఉన్నా ఎలా బయటపెట్టాలో తెలియని వారికి ఈ జబర్దస్త్ ప్లాట్‌ఫామ్ ఎంతో మేలు చేసింది. జబర్దస్త్‌లో స్కిట్స్ చేసిన కమెడియన్స్ ఏకంగా వెండితెరపై హీరోలయ్యారు కూడా. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కామెడీ షో చేసిన మేలేంటనేది. అలాంటి జబర్దస్త్‌లో కూడా ఎక్కడో చోట కొన్ని లుకలుకలు ఉన్నాయని తాజాగా జబర్ధస్త్ హరి అలియాస్ హరిత చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి. చిన్నితెర కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులకు యమ డిమాండ్. ఈ లేడీ గెటప్స్‌తోనే తక్కువ సమయంలోనే క్రేజీ కమెడియన్‌గా మారింది హరిత. తనదైన కట్టు బొట్టుతో ఆకట్టుకుంటూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. ఈమె నిజమైన అమ్మాయి కాదు అంటే ఏ ఒక్కరూ నమ్మనంతగా లేడీ గెటప్పుల్లో ఇన్వాల్వ్ అయింది. దీంతో హరిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె షాకింగ్ నిజాలు బయటపెట్టి వార్తల్లో నిలిచింది. జబర్ధస్త్ షో, టీమ్ లీడర్స్, తన వ్యక్తిగత జీవితం గురించి రియాక్ట్ అయిన హరిత.. తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఓపెన్ అయింది. ఒక్క ఫోన్ కాల్ తోనే ఇండస్ట్రీకి వచ్చా కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో కష్టాలు అనుభవించానని చెప్పింది. ''పేర్లు చెప్పను కానీ.. క్యారెక్టర్ కోసం అడిగితే ఉంది రూమ్‌కి రా అని జబర్దస్త్ టీమ్ లీడర్స్ కొందరు పిలిచారు. తీరా హైదరాబాద్‌కి వచ్చి ఫోన్ చేస్తే మీ క్యారెక్టర్ వేరే వాళ్లకు ఇచ్చామని చెప్పేవారు. కొన్ని సందర్బాల్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోయేవారు. దీంతో దిల్‌‌సుఖ్‌నగర్ బస్టాండులోనే ఆగిపోయి ఏడుస్తూ ఉండిపోయిన రోజులు చాలా ఉన్నాయి'' అని హరిత చెప్పుకొచ్చింది. ఇకపోతే.. ''నేను పైకి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు కనిపిస్తాను. ఇదే విషయం చాలా మంది నాతో అన్నారు. కానీ.. అందురూ అనుకునేది చాలా తప్పు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఒకరోజు తింటే రెండు రోజులు పస్తులున్న రోజులున్నాయి'' అని హరిత వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jCZjuS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...