మగతనం చూపించడంలోనే అసలుసిసలు హీరోయిజాన్ని పండించారు మన దర్శకులు చాలామంది. ఇక మెగా ఫ్యామిలీ హీరో.. అందులోనూ మెగాస్టార్ మేనల్లుడు తొలి చిత్రం అంటే హీరోయిజం, మగతనం చూపించే విషయంలో నో మొహమాటమ్స్ అని మెగా ఫ్యామిలీ ట్రీ చిత్రాలను చూస్తే ఓ అవగాహనకు రావొచ్చు. కానీ ఎంట్రీ కథే మగతనానికి సంబంధించినది అయితే ఏ హీరో అయినా ఆలోచనలో పడతారు. కథలో ఎంత దమ్ము ఉన్నా.. క్యారెక్టర్ విషయంలో ఏదైనా డ్యామేజ్ వస్తుందేమో అని డౌటానుమానాలు పడుతూనే ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు అన్నట్టు ఆయనైతే ఇలాంటి సినిమాని చేయనని.. ఒకవేళ మెగా ఫ్యామిలీ హీరోలు చేస్తానని చెప్పినా వద్దనేవాడినని అన్నారు. నిజం కూడా అంతే. వైష్ణవ్ తేజ్ నటించిన ‘’ సినిమా చాలా డేంజరస్ కంటెంట్. కానీ దాన్ని చాలా కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేసి బాక్సాఫీస్‌ని బద్దలయ్యేట్టు చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. అయితే ఈ కథను ఒప్పించడం వెనుక.. వైష్ణవ్ తేజ్ చేయడం వెనుక బలమైన మెగా శక్తి ఉందంటున్నారు బుచ్చిబాబు ఆయనెవరో కాదు.. మెగా పవర్ స్టార్ . ఆయనే ఈ సినిమా కథ చిరంజీవి వరకూ వెళ్లడం.. ఆయన్ని ఒప్పించడం.. వైష్ణవ్‌తో మాట్లాడించడం ఇవన్నీ ఆయన చేసినవే అంటున్నారు బుజ్జిబాబు. ఇంకా ఏమన్నారంటే.. ‘రామ్ చరణ్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. వైష్ణవ్ తేజ్‌కి కథ చెప్పడానికి వెళ్లినప్పటి నుంచీ నాకు మామూలు సపోర్ట్ చేయలేదు. సార్.. మీ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి హీరోగా కావాలి అని అంటే.. మరి నాకోసం కథ రాయలేదా? అని అడిగారు. సర్లే నేను మాట్లాడతా అని.. చిరంజీవి సార్‌తో మాట్లాడి ఈ సినిమా కథ వెనుక నిలబడ్డ బలం అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ సార్. చాలా బలంగా నిలబడ్డారు. బహుబలి సినిమాలో పెద్ద విగ్రహం ఎలా ఉంటుందో ఈ సినిమాకి రామ్ చరణ్ అలా నిలబడ్డారు. వైష్ణవ్ ఈ సినిమా చేశాడంటే రామ్ చరణ్ ఇంత ఎంకరేజ్ చేయడం వల్లే’ అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dm7avG
v
No comments:
Post a Comment