Sunday, 7 February 2021

సన్నీలియోన్‌పై పోలీస్ కేసు.. అలా మోసం చేసిందంటూ ఫిర్యాదు! పోలీసుల వద్ద మాజీ పోర్న్ స్టార్..

హాట్ బాంబ్, సినీ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ చిక్కులో పడింది. ఆమె నమ్మించి మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక నేరానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సన్నీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఇష్యూపై సన్నీ స్టేట్‌మెంట్‌ తీసుకొని ఫైల్ చేశారట కేరళ పోలీసులు. కేరళ రాష్ట్రం పెరుంబవూర్‌కు చెందిన షియాస్ అనే ఈవెంట్ కో-ఆర్డినేటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సన్నీలియోన్‌పై విచారణ సాగుతోంది. తనని నమ్మించి 29 లక్షల రూపాయలు తీసుకొని సన్నీలియోన్ మోసం చేసినట్లు షియాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను నిర్వహించాల్సిన రెండు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి డబ్బు తీసుకున్న ఆమె, ఆ తర్వాత మొహం చాటేసి ప్రోగ్రామ్స్ అటెండ్ కాలేదని తెలిపాడు. దీంతో సన్నీపై ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేరళలో విహారయాత్రలో ఉన్న సన్నీలియోన్ నుంచి కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. అయితే సదరు ఈవెంట్ మేనేజర్‌ను మోసం చేయాలని తాను భావించలేదని, తన కాల్షీట్లకు అనుగుణంగా ఆ కార్యక్రమాలు షెడ్యూల్ చేయకపోవడం వల్లే హాజరు కాలేకపోయానని సన్నీలియోన్ వెల్లడించినట్లు సమాచారం. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తిరిగి ఇచ్చేదిలేదని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈవెంట్ మేనేజర్, సన్నీలపై తదుపరి విచారణ చేపట్టి చర్య తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oVju8r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...