Monday, 1 February 2021

‘చక్ర’ విడుదల తేదీ ఖరారు.. నాలుగు భాషల్లో విశాల్ సినిమా

హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘చ‌క్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రను రెజీనా క‌సాండ్ర పోషించారు. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 19న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్నడ భాషల్లో విడుద‌ల‌ చేయ‌నున్నట్లు అధికారికంగా ప్రక‌టించింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘చ‌క్ర’. ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 19న నాలుగు సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రంలో ఇంకా మ‌నోబాల, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టి డాంగే ముఖ్య పాత్రలు పోషించారు. బాల‌సుబ్రమ‌ణియం‌ సినిమాటోగ్రపీ అందించిన ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tjICJl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...